వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
ఇంటికి రంగులు కాదు - వంటికి హంగులు కాదు
అల్లరి ఆటలు కాదు - త్రాగుబోతు విందులు కాదు (2)
మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్
||వచ్చింది||
రంగురంగు వస్త్రాలు - మురికిగుడ్డల మనస్సులు
మెరిసిపోతున్న ఇళ్ళు - మాసిపోయాయి హృదయాలు
ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు
పేరుకేమో క్రైస్తవులు - తీరుమారని జనులు (2)
||ఇంటికి||
విద్యలేని పామరులు - విధేయులై బ్రతికారు
విద్యవున్న సోమరులు - మందిరాలకే రారు
తూర్పుదేశపు జ్ఞానులే - మోకాళ్ళు వంచినారు
చదువు పదవుంటే చాలు - మోకరించరు వీరు (2)
||ఇంటికి||
దినములు చెడ్డవి గనుక - సమయమును పోనియ్యక
అజ్ఞానులవలె కాక - జ్ఞానులవలె నడవాలి
పాపము తీయుట కొరకే - ప్రభు పుట్టాడని తెలిసి
పాపము వీడక నీవు - ఉత్సవ ఉల్లాసాలా (2)
||ఇంటికి||