నిబ్బరముతో నా యేసుకే స్తుతి పాడెదా
వేకువనే లేచి నా ప్రభునే కొనియాడెదా (2)
యేసయ్యా… యేసయ్యా… స్తుతులకు పాత్రుడవు నీవయ్యా
యేసయ్యా… యేసయ్యా… మహిమ ఘనతలు నీకయ్యా (2)
||నిబ్బరముతో||
కష్టకాలమందు నాకు - కనికరము చూపెను
కాలుజారుతున్నవేళ - కరుణతో నిలిపెను (2)
కడుపు కాలుతున్నవేళ - నా కడుపు నింపెను
కన్నీటి బ్రతుకును - నాట్యముగా మార్చెను
కఠినమైన కాలములో - నా చెంత నిలిచెను
||యేసయ్యా||
దిక్కుదెసలేని నాకు - దర్శనము నిచ్చెను
ధనము ఘనము లేని నాకు ఘనతనెంతో నిచ్చెను (2)
దిక్కుతోచని వేళ - నా దిక్కై నిలిచెను
దుష్ట శక్తులన్నిటిని - నాకు దూరపరచెను
దీవెనలు కుమ్మరించి - ధన్యునిగా చేసెను
||యేసయ్యా||