కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా
కలుషము బాపగ - కరుణను చూపగ నన్ను వెదికెనుగా (2)
అజేయుడా విథేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2)
కష్టాలలో (నా) నష్టాలలో
నన్నాదుకున్నావయ్యా
వ్యాధులలో (నా) బాధలలో
కన్నీరు తుడిచావయ్యా (2)
మధురమైన ప్రేమా
మరువగలనా దేవా (2)
అనుక్షణం నీ ఆలోచనా
నిరంతరం నాకు నిరీక్షణ (2)
||కలువరి||
ద్రోహానికై (నా) మోసానికై
నీ రక్తాన్ని కార్చావయ్యా
పాపానికై (నా) శాపానికై
మరణించి లేచావయ్యా (2)
చెరగని నీదు ప్రేమా
తరిగిపోవునా దేవా (2)
అజేయుడా విథేయుడా
సజీవుడా సంపూర్ణుడా (2)
||కలువరి||