అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా
సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
మన యవ్వన జీవితములు - శరీరాశకు లోబరచి (2)
చెడు మాటలను పలుకుచు - శాంతి లేక యుంటిమిగా (2)
||అమూల్య||
చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము (2)
నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి (2)
||అమూల్య||
నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక (2)
స్వంత నీతి తోడనే - దేవుని రాజ్యము కోరితిమి (2)
||అమూల్య||
కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను (2)
ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను (2)
||అమూల్య||
తన రక్త ధారలలో - మన పాపములను కడిగి (2)
మన కన్నులను తెరచి - మనల నింపెను జ్ఞానముతో (2)
||అమూల్య||
పాపులమైన మన మీద - తన యాశ్చర్య ఘన ప్రేమ (2)
కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము (2)
||అమూల్య||
మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా (2)
మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములను (2)
||అమూల్య||