ఆదాము హవ్వల కళ్యాణం
అందరి హృదయాల ఆనందం (2)
సమతా మమతలు కలిగుండాలి
ఒకరిని ఒకరు ప్రేమించాలి (2)
కష్టములోన నష్టములోన (2)
సహనము కలిగి జీవించాలి (2)
||ఆదాము||
ప్రభు యేసు నీ దీవెనలన్ని
వీరిరివురిపై దిగి రావాలి (2)
సంతానముతో సౌభాగ్యముతో (2)
సంసార నావను సాగించాలి (2)
||ఆదాము||