సజీవ సాక్షులుగా మమ్ము నిలిపిన దేవా వందనం
నీ చిత్తమందు స్థిరపరచినావు యేసు అభివందనం
ఏమిచ్చి నీ ఋణం తీర్చగలము
జిహ్వా ఫలము అర్పింతుము (2)
మేమున్నాం నీ చిత్తములో
మేమున్నాం నీ సేవలో (2)
||సజీవ||
తల్లి గర్భమునందు - మమ్మును రూపించి
శాశ్వత ప్రేమతో మేము నింపి - భువిని సమకూర్చినావు (2)
ఎగిసిపడే అలలెన్నో - అణచివేసి జయమిచ్చినావు
భీకరమైన తుఫానులోన - నెమ్మదినిచ్చి బ్రతికించావు
కృంగిపోము మేమెన్నడు
ఓటమి రాదు మాకెన్నడు (2)
||సజీవ||
ఉన్నత పిలుపుకు మము పిలిచిన - నీ దివ్య సంకల్పం
నెరవేర్చుము మా పరిశుద్ధ దేవా - మహిమ పూర్ణుడా (2)
జడివానలైనా సుడిగాలులైనా - కాడిని మోస్తూ సాగెదం
నిందలయినా బాధలైనా - ఆనందముతో పాడెదం
కలత చెందము మేమెన్నడు
అలసట రాదు మాకెన్నడు (2)
||సజీవ||