నీతి సూర్యుడవై వెలుగుతున్న యేసయ్య
నీ ఏర్పాటులోన నీ దేహము మేమయ్య (2)
నీదు రక్షణతో మమ్ము కాచినందుకు
నీదు సంఘముగా మమ్ము నిలిపినందుకు (2)
నీకే వందనం - నీకే వందనం
నీకే వందనం - యేసు రాజ వందనం (2)
||నీతి||
త్వరలో రానై ఉన్నావయ్యా మా ప్రభువా
నీదు విందులోన చేరాలని మా దేవా (2)
సిద్ధపాటుకై కృపలను చూపుమని
నిన్నే వేడితిమి నీవే మా బలమని (2)
||నీకే||
నీ నామము రుచిని ఎరిగిన వారము మేము
నిరతము నీ మంచి మన్నాతో బ్రతికెదము (2)
నీ ఆశ్రయములో కురిసెను దీవెనలు
నీలో నిలిచెదము చాటగా నీ తేజము (2)
||నీకే||