ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా (2)
నా కష్టాలలో ఆరాధన
శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన
||ఆరాధనా||
ఓటములే నాకు మిగిలినా - కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా - సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)
||ఆరాధనా||
రోగములే క్షీణించినా - శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శోధనలే చుట్టుముట్టినా - పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)
||ఆరాధనా||